కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటన సంచలనం సృష్టించింది. 18 ఏళ్ల వివాహబంధానికి స్వస్తి పలుకుతున్నట్లు వీరిద్దరు ట్విట్టర్ ద్వారా తెలిపారు.వీరిద్దరు 2004లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు యాత్ర ,లింగ అనే ఇద్దరు కుమారులు. 2006 యాత్ర , 2010లో లింగలు జన్మించారు.
ఇక తాజాగా వీరి విడాకులపై హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించారు. ధనుష్- ఐశ్వర్య విడాకులు తీసుకోలేదని వాళ్లు మళ్లీ కలుస్తారని మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
వారిద్దరూ ప్రస్తుతం చెన్నైలో లేరని.. హైదరాబాద్లో ఉన్నారని, విడాకుల విషయమై వారికి ఫోన్ చేసి మాట్లాడినట్లు పేర్కొన్నారు. నాతో పాటు ఐశ్వర్య తండ్రి రజినీకాంత్ కూడా విడాకుల విషయమై మరోసారి ఆలోచించాలి అని చెప్పారు. త్వరలోనే వాళ్లు మళ్లీ కలుస్తారు” అని చెప్పుకొచ్చారు.
సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలెబ్రిటీలు పిల్లల భవిష్యత్తు రీత్యా విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు’’ అని ధనుష్ తండ్రి కస్తూరి రాజా తెలిపారు.
ధనుష్ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ సినిమా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఇవి రెండు ద్విభాషా చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి.