హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ఎన్ని చట్టాలు వచ్చినా అమ్మాయిల మీద అరచకాలు ఆగడంలేదు..చిన్న పెద్ద, ముసలి అని చూడకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. అమ్మాయిలకు ఎక్కడా సెక్యూర్ లేకుంటా పోతుంది. ఇంట్లో, బయట, ఆకరికి బడిలో కూడా .. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే దారుణానికి పాల్పడ్డాడు. విద్యార్థినిపై ప్రిన్సిపాల్అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్‌పేట ఠాణా పరిధిలో జరిగింది.
మాజీ ప్రధానోపాధ్యాయురాలి జోక్యంతో చివరికి ఏడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వివర్లాలోకి వెళితే..
శామీర్‌పేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థిని(15) తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 22న పాఠశాలకు వెళ్లింది. మాస్కు పెట్టుకోలేదనే కారణంతో తన గదిలోకి రావాల్సిందిగా విద్యార్థినిని ఆదేశించిన ప్రధానోపాధ్యాయుడు తర్వాత అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించడంతో బాలిక భయపడి తల్లితో సహా ఎవరికీ చెప్పలేదు.
అయితే.. అదే పాఠశాలలో గతంలో పనిచేసిన ప్రధానోపాధ్యాయురాలు కలవడంతో బాలిక జరిగిన దారుణాన్ని ఆమెతో చెప్పింది. ఆమె ధైర్యం చెప్పడంతో బాలిక, ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ సుధీర్‌కుమార్ పేర్కొన్నారు.
మరోవైపు విషయం బయటకు పొక్కడంతో రాజకీయ నేతలు ప్రధానోపాధ్యాయుడికి మద్దతు పలికారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.