మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా “గని” . బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో తన మేకోవర్ మార్చుకుని ఈ చిత్రంలో నటించాడు వరుణ్. ఇందులో వరుణ్‌కు జతగా సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది..
తాజాగా చిత్రం కొత్త విడుదల తేదీని మేకర్స్ విడుదల చేశారు. వరుణ్‌తేజ్ ‘గని’ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం. 2022 మార్చి 18న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ఈ చిత్రం డిసెంబర్ 24న ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా..అయితే ముందు ‘పుష్ప’, తోడుగా ‘శ్యామ్ సింగ రాయ్’ నుంచి పోటీ గట్టిగా ఉండడంతో పక్కకు తప్పుకున్నాడు “గని”. సోలోగా రావడమే సో బెటర్ అని అలోచించి కొత్త విడుదల తేదీని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు కొత్త పోస్టర్ తో పాటు న్యూ రిలీజ్ డేట్ ను వరుణ్ తేజ్ స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించాడు ఈ పోస్టర్లో వరుణ్ తేజ్ ఇంటెన్స్ లుక్ లో అదరగొడుతున్నాడు.
సిద్ధు, అల్లు బాబీ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ టైటిల్ క్యారెక్టర్లో కన్పిస్తుండగా, సాయి మంజ్రేకర్, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలకపాత్రల్లో నటించారు. సంగీతం తమన్ అందిస్తున్నాడు.
కత్రినా నన్ను వదిలేసింది… సల్మాన్ వ్యాఖ్యలు