telugu navyamedia
సినిమా వార్తలు

ఫ్రెండ్‌షిప్‌ డే కాదు.. ఎనిమి డే..!

వివాద‌స్ప‌ద డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ తనకు న‌చ్చిన‌ట్టు ఇష్టానుసారంగా మాట్లాడూతూ ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తుంటాడు. అయితే కొత్త‌గా స్నేహితుల దినోత్సవం పుర‌స్క‌రించుకొని.. ప్రపంచమంతా ఈ రోజును పండుగలా జరుపుకుంటుంటే.. ఇది అస‌లు ఫ్రెండ్‌షిప్‌ డే కాదు.. ఎనిమి డే అంటూ స్నేహితుల మ‌ధ్య ఉన్న‌ అనుబంధంపై నీళ్ళు చ‌ల్లాడు.

అందుకు ప్రధానంగా ఆయన ‘స్నేహితుడికి సాయం చేస్తే ఓ స‌మ‌స్య వ‌స్తుంద‌ని, వాడికి మ‌రోసారి సాయం అవ‌స‌ర‌మైన‌ప్పుడు కూడా మ‌ళ్లీ నీ ద‌గ్గ‌రికే వ‌చ్చి అడుగుతాడు’ వర్మ మ‌రోసారి వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. అయితే ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వర్మ మాటలపై కొందరు మండిపడుతున్నారు.

చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరిపై సెటైర్లు వేస్తాడు.. వివాదాల్లో చిక్కుకుంటాడు. మళ్లీ తాను చేసిన ట్వీట్‌కి భిన్నంగా మరో ట్వీట్ చేసి.. ఫాలోవర్లను భిన్నంగా స్పందింస్తూ కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. ఇది రామ్ గోపాల్ వర్మకు వెన్న‌తో పెట్టిన విద్య అనే చెప్పొచ్చు..!

Related posts