telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” కు బయ్యర్లు కావలెను ?

ditributers req for varmas lakshmis ntr
గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు విడుదల తేదీని ఎందుకు ప్రకటించడం లేదో తెలుసా? బయ్యర్లు లేకపోవడం, ఆశించినత బిజినెస్ రాకపోడం వల్లనేనట. తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో రామగోపాల్ వర్మను మించినవాడు మరొకడు ఉండదు. సినిమాలో కంటెంట్  కన్నా మీడియా  కవరేజ్ తెచ్చుకోవడంలో వర్మ సిద్ధహస్తుడు. అయితే చాలా సందర్భాల్లో  వర్మ పబ్లిసిటీ వికటించింది.  అయినా  వర్మ మారడు, హైప్ క్రియేట్ చేస్తూనే ఉంటాడు.
 
ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు కూడా మీడియా, సోషల్ మీడియాలో  విపరీతమైన క్రేజ్ తీసుకు వచ్చాడు. ఏ ఛానల్ చూసినా వర్మ, లక్ష్మి పార్వతి కనిపిస్తున్నారు. సినిమా మీద నమ్మకాన్ని బాగా పెంచుకున్నారు. అయినా వర్మ  అనుకున్నది నెరవేరలేదు. తను విడుదల చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్  ట్రైలర్ ను నెటిజన్లు లక్షల్లో చూశారు. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను కొనడానికి బయ్యర్లు మాత్రం ముందుకు రావడం లేదట.
 
నాగార్జున తో చేసిన సినిమా “ఆఫీసర్” బయ్యర్లను ముంచేసింది. చాలామంది కోట్లలో నష్టపోయారు. కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నాగార్జున, వర్మ కలసి అంత చెత్త సినిమా చేస్తారని బయ్యర్లు ఊహించలేదు. ఆ  సినిమా ఆర్ధికంగా ముంచిన షాక్ నుంచి వారు ఇంకా తేరుకోలేదట. అందుకే లక్ష్మీస్ ఎన్టీఆర్ నెట్లో  హల్  చల్ చేస్తున్నా బయ్యర్లు ముందుకు రావడం లేదు. ఈ సినిమాకు వచ్చిన పబ్లిసిటీ చూసి బయ్యర్లు పరిగెత్తుకుంటూ వస్తారని,  అన్ని ఏరియాలకు పోటీ అధికంగా ఉంటుందని వర్మ తెగ ఆశలు పెట్టుకున్నాడు.
 
అందుకే ఆంధ్ర,  తెలంగాణకు కలిపి 12 కోట్లుకు అమ్ముదామని అనుకున్నాడు కానీ. బయ్యర్లు వస్తే కదా, అందుకే  కనీసం 7 లేదా 8 కోట్లు వచ్చినా చాలనుకున్నాడట. అయినా బయ్యర్లు ఏవో కొన్ని ఏరియాలు తప్ప రెండు రాష్ట్రాల్లో ఎక్కువ భాగం కొనడానికి ఎవరు ముందుకు రావడం లేదని తెలుస్తుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్లో అంతా కొత్తవాళ్లు కావడం, వర్మ మ్యాజిక్ పూర్తిగా పడిపోడం, గత సినిమాలు ఘోర పరాజయ ప్రభావం లక్ష్మీస్ ఎన్టీఆర్ మీద పడిందట. అందుకే ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేసేది వర్మ చెప్పడం లేదు. మీడియా లో అంత హైప్ క్రియేట్ చేసుకోగలిగినా  వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు బిజినెస్ ను మాత్రం చేసుకోలేకపోయాడు.
 
నిజానికి బాలకృష్ణ కథానాయకుడు కొట్టిన దెబ్బకు బయ్యర్లు దిమ్మతిరిగి మైండు బ్లాంక్ అయిపోయారు. బాలకృష్ణ ఇది గ్రహించి రెండో భాగం మహానాయకుడు ఇదే బయ్యర్లకు ఉచితంగా ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. వర్మ సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు చేస్తుందని నెటిజన్లు అనుకుంటున్నా, అంత లేదులే అని బయ్యర్లు బాహాటంగానే చెబుతున్నారు. దీంతో వర్మ టెన్సన్స్ తో తలా పట్టుకున్నాడట. మార్చిలోనైనా అతను విడుదల చేసుకోలేక పొతే ఎలక్షన్ కోడ్  వచ్చేస్తుంది. తెలుగుదేశం వారు ఇప్పటికే వర్మ మీదా మండిపడుతున్నారు, కేసులు కూడా పెడుతున్నారు. చిన్న అవకాశం వచ్చినా వర్మను వదిలిపెట్టారు. 

Related posts