telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

బాతు చేసిన పని చూడడానికి ఎగబడుతున్న నెటిజన్లు… ఇంతకీ ఏం చేసిందంటే ?

Duck

ఇప్పుడు ఫేస్‌బుక్‌లో ఓ బాతుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. బాతు.. ఒడ్డున ఉన్న ఆహారపు కంటైనర్ నుంచి నీటిలో ఉన్న చేపలకు తన నోటితో ఆహారాన్ని అందిస్తోంది. నీళ్లలోని చేపలు బాతు అందించిన ఆహారాన్ని అందుకోవడం… మళ్లీ బాతు ఒడ్డుపై నుంచి ఆహారం అందివ్వడం.. చేపలు దాన్ని ఎంచక్కా లాగించేయడం వీడియోలో ఉంది. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. బ్రెజిలియన్ మత్స్యకారుల పేరిట ఉన్న ‘Dias e Noites De Pesca’ అనే ఫేస్‌బుక్ పేజీలో ఈ వీడియో శనివారం పోస్ట్ అయింది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 12 మిలియన్ల వ్యూస్, 2.8 లక్షల షేర్లు, వేలాది కామెంట్లు వచ్చాయి. ట్విట్టర్‌లోనూ వీడియో షేర్ కావడంతో దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Related posts