ఆదిలాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై పర్యటన రద్దయ్యింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి వాతావరణంలో మార్పులు జరగడం వల్ల అధికారులు గవర్నర్ పర్యటనను రద్దు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ లో జరగనున్న గిరిజన నాయకుడు బిర్సాముండా 146 జయంతి వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది. అదే విధంగా నాగోబా ఆలయంలో పూజలు చేయాల్సి ఉంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ, వాతావరణంలో మార్పుల కారణంగా ఈ పర్యటన వాయిదాపడింది.
previous post