తెలంగాణ భవన్ లో మంత్రి పువ్వాడ అజయ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈరోజు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు తెలంగాణ భవన్‌లోకి వస్తుండగా పువ్వాడను పోలీసులు తనిఖీ చేశారు.
పోలీసుల చర్యతో పువ్వాడ తీవ్ర అసహనానికి లోనయ్యారు. మంత్రిని అని చూడకుండా తనిఖీ చేస్తారా? అని మండిపడ్డారు. జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదు చేస్తానని మంత్రి వెల్లడించారు.