మెగస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో టాలీవుడ్లో అగ్రకథానాయకుడు దూకుడు మామూలుగా లేదు. సెట్‌పై రెండు సినిమాలు ఉండగానే మరో సినిమా షూటింగ్‌లోనూ పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న ‘భోళా శంకర్’ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్.
చిరంజీవి నటిస్తున్న154వ సినిమా ‘భోళా శంకర్’ ముహూర్తం ఖరారైంది. నవంబరు 11న ఉదయం 7:45 గంటలకు చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే నెల 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని కూడా వెల్లడించారు.ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా సోషల్ మీడియా ద్వారా వదిలారు. ఈ చిత్రం ఎక్కువ భాగం షూటింగ్ కోల్‌కతాలో జరుగుతుంది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’ మూవీ రీమేక్‌గా భోళా శంకర్ రూపొందబోతోంది. ఇందులో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా .. చిరుకు చెల్లేలుగా కీర్తి సురేశ్ నటించనుంది.
#BholaShankar 𝐏𝐨𝐨𝐣𝐚 𝐂𝐞𝐫𝐞𝐦𝐨𝐧𝐲 𝟏𝟏-𝟏𝟏-𝟐𝟏
𝐌𝐞𝐠𝐚 𝐒𝐡𝐨𝐨𝐭 𝐛𝐞𝐠𝐢𝐧𝐬 𝐟𝐫𝐨𝐦
𝟏𝟓-𝟏𝟏-𝟐𝟏@KChiruTweets pic.twitter.com/8IeA0teifv— 𝐂𝐡𝐢𝐫𝐚𝐧𝐣𝐞𝐞𝐯𝐢 𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬 𝐅𝐚𝐧𝐬 (@Santhos43007209) October 27, 2021