telugu navyamedia
సినిమా వార్తలు

మగువ మనసు-ని(ఆ)వేదన..

prema kosam poetry corner
మగువ మనసు
————————–
మగువ మనసు చిగురాకులా కోమలమైనది
పసిపాప నవ్వులా స్వచ్ఛమైనది
అమ్మ పాలలా శ్రేష్ఠమైనది
మహా సముద్రంలా లోతైనది
ఆకాశమంత విశాలమైనది
ఆడవారి మనసు అంతుచిక్కని
“చిదంబర రహస్యం”
నేలపై ఒలికితే చేతికందనిపాదరసం
నీటి మీద ఓడ జాడ లాంటిది
గాలిలో రాసిన రాతలాంటిది
కంటికి కనిపించదుచెవికి వినిపించదు.
=================#================
ని(ఆ)వేదన
———————–
సఖీ ప్రియా!
నిన్ను చూసిన ఆ తొలిక్షణం నుంచి
నా మూగ మనసు అదోలా ఉంది
విరహవేదనతో రగిలిపోతుంది
కలవరింతలతో దద్దరిల్లుతుంది
నడిరేయి తొలిజాములో
వలపుల తలపుల కలల అలల తాకిడికి
కనులకు నిదుర దూరమవుతుంది
బ్రతుకు భారంగా తోస్తుంది
ప్రతిక్షణం నీ ధ్యాసే!!
ప్రేమ దేవతా! కరుణించవా!
ఒక్కసారి కనిపించవా!!
నా ప్రేమను బ్రతికించవా!!
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

Related posts