‘కాంచన 3’ సినిమాలో రాఘవ లారెన్స్ పక్కన నటించిన అలెగ్జాండ్రా జావి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాఘవ లారెన్స్ కాంచన సినిమాలో నటించిన రష్యన్ మోడల్ మరియు హీరోయిన్ “అలెగ్జాండ్రా జావి” గోవాలోని తన నివాసంలో పోలీసులు మృతదేహాన్ని కనుగొన్నారు.
పోలీసల మొదటి విచారణలో 24 ఏళ్ల ఈ హీరోయిన్ ఆత్మహత్య చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల తన ప్రియుడితో బ్రేకప్ అవటంతో డిప్రెషన్ లోకి వెళ్లిందని.. ఈ కారణంగానే తను ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గతంలో చెన్నై ఫోటోగ్రాఫర్ వేధించాడని పోలీసులకు ఫిర్యాదుయి చేసింది ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.
కాగా రాఘవ లారెన్స్ రూపొందించిన హారర్ మూవీ కాంచన 3 అప్పటిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో పగ తీర్చుకునే దయ్యం పాత్రలో రష్యన్ కి చెందిన అలెగ్జాండ్రా జావి అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలెగ్జాండ్రా జావి ఆత్మహత్యకు పాల్పడిందనే న్యూస్ తెలిసి అంతా షాకవుతున్నారు.