బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రేమలు , పెళ్లిళ్ల పై ఇప్పటికే నిత్యం రకరకాల వార్తలు మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. గతంలో కత్రినా కైఫ్ రణ్ బీర్ కపూర్‌తో ప్రేమాయణం నడిపించిందని వార్తలు వినిపించాయి. ఈ ఇద్దరు కలిసి పార్టీలకు, విదేశాలకు వెళ్తూ పలుసార్లు మీడియా కంటపడ్డారు. ఆ తర్వాత కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కత్రినా పెళ్లి అంటూ గుసగుసలువినిపించాయి. కత్రినా-సల్మాన్ చాలా కాలంగా లవ్ స్టోరీ నడిపించారంటూ కూడా వార్తలు వినిపించాయి.
ఇదిలా ఉంటే కత్రినా కైఫ్- యంగ్ హీరో విక్కీ కౌశల్ సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారంటూ కొంత కాలంగా బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. కానీ తాజాగా జరిగిన రోకా ఫంక్షన్‌లో కత్రినా- విక్కీ ఉంగరాలు మార్చుకున్నారంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.
దాదాపు రెండేళ్లుగా విక్కీ-కత్రినా డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. న్యూఇయర్ పార్టీకి మాల్దీవులకు వెళ్లడం, కలిసి ప్రైవేటు పార్టీలు, వేడుకల్లో పాల్గొనడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. దీంతో నెటిజన్ల నుంచి వీరికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు ‘ఫీలింగ్ సారీ ఫర్ సల్మాన్ ఖాన్’ అంటూ మరికొందరు నెటిజన్లు వ్యంగ్యంగా పోస్టులు షేర్ చేస్తున్నారు. కత్రినా-విక్కీ ఎంగేజ్‌మెంట్‌పై పెద్ద ఎత్తున వార్తలు బయటకు వస్తుండటంతో ఆమె టీం దీనిపై క్లారిటీ ఇచ్చింది. ‘రోకా వేడుక జరిగిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. కత్రినా అతి త్వరలోనే ‘టైగర్-3’ షూట్ కోసం విదేశాలకు వెళ్తున్నారు’ అని పేర్కొన్నారు.
కాగా.. విక్కీ కౌశల్ ఉరి సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో బాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు.అలాగే కత్రినా కైఫ్ విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన మల్లేశ్వరి సినిమాలో టాలీవుడ్‌లో నటించిన సంగతి తెలిసిందే.!