ఎన్నో టాస్క్‌లు, మరెన్నో మలుపులు, డాన్స్‌లు, వినోదంతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో అలరించే రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ మళ్ళీ మరో సీజన్‌తో రాబోతుంది. ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈషో ఇప్పుడు ఐదో సీజన్‌తో కనువిందు చేయడానికి సన్నద్దమవుతుంది. తాజాగా ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్5’ కొత్త లోగో ను ‘స్టార్‌మా’ టీమ్ విడుదల చేసింది.
మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండో సీజన్ ను నాని హోస్ట్ చేసాడు. ఇక మూడు, నాలుగు సీజన్లకు నాగార్జున హోస్ట్ అయ్యాడు. అయితే సీజన్ 5కి హోస్ట్ ఎవరనేదే తెలియాలి.
సీజన్ 5కి సంబంధించి.. ఓ వైపు అక్కినేని నాగార్జున పేరు వినిపిస్తుండగా మరోవైపు దగ్గుబాటి రానా పేరూ ప్రచారంలో ఉంది. ఈ ఇద్దరిలో ఆ అవకాశం ఎవరు అందుకున్నారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. హోస్ట్ మాత్రమే కాదు కంటెస్టెంట్ల ఎవరు ఉండబోతున్నారనేది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అల్లు అర్జున్ ఒక్కడే రియల్ మెగాస్టార్..