వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని దూషించిన కేసీఆర్‌తో జగన్ కలిసి పార్టీని భ్రష్టుపట్టించారని విమర్శించారు. రాజశేఖర్‌రెడ్డిపై తనకున్న అభిమానంతో తాను వైఎస్సార్ పార్టీ పెట్టానన్నారు. ఈ నేపథ్యంలో జగన్ తనవద్దకు వచ్చి కలిసి నడుద్దామని చెప్పి పార్టీలో చేరారన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ప్రశ్నించినందుకు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు.
వైసీపీ పగ్గాలను తిరిగి తానే చేపడతానని, ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశానని కొలిశెట్టి శివకుమార్ మీడియాకు తెలిపారు. ఎన్నికల కమిషన్‌లో వైసీపీ తన పేరు మీదే ఉందని.. త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తానని కొలిశెట్టి శివకుమార్ అన్నారు.