telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా బయోపిక్ నేనే తీసుకుంటా .. అంటున్న మణికర్ణిక ..

kangana ranout on her biopic

కంగనా రనౌత్ మణికర్ణిక ఫిల్మ్‌తో డైరక్టర్‌గా మారిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకు వేసింది. అదేమంటే, తన జీవితకథ ఆధారంగా తీసే సినిమాను తానే డైరక్ట్ చేయనున్నట్లు చెప్పారు. మణికర్ణిక సినిమాకు కథ రాసిన కేవీ విజయేంద్ర ప్రసాదే.. ఆ బయోపిక్‌కు కూడా స్క్రిప్టు రాస్తున్నాడని ఆమె తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో సాధించిన సక్సెస్ ఆధారంగా సినిమా ఉంటుందని, సున్నితమైన అంశాలను చాలా లైటర్ స్టయిల్‌లో ప్రజెంట్ చేయనున్నట్లు కంగనా తెలిపారు.

హిమాలయాల నుంచి వచ్చిన ఓ అమ్మాయి.. బాలీవుడ్‌లో ఎలా ఓ ప్రముఖ హీరోయిన్‌గా ఎదుగుతుందన్న కథాంశంతో సినిమాను రూపొందించనున్నట్లు ఆమె చెప్పారు. గ్యాంగ్‌స్టర్‌, తనూ వెడ్స్ మనూ, ఫ్యాషన్‌, క్వీన్ లాంటి సినిమాల్లో రనౌత్ నటించారు. ఆమె రెండు సార్లు జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్నది.

Related posts