వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వరుసగా సీఎం జగన్‌కు లేఖలు రాస్తున్నారు. ఈ సారి పార్టీ ఎంపీ విజయస్థాయి రెడ్డిని అదుపులో పెట్టాలంటూ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అశోక్ గజపతిరాజుపై ఎంపీ విజయసాయిరెడ్డి అనవసరంగా నోరు పారేసుకొంటున్నారని ఆయనను వెంటనే అదుపు చేయాలని లేఖలో సీఎం వైఎస్ జగన్‌ను కోరారు రఘురామ.. ఎంపీ విజయసాయిరెడ్డి తీరుతో పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశం ఉందని రాసుకొచ్చిన ఆయన.. అశోక్‌గజపతి రాజుపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు అని హితవుపలికారు… మాన్సాస్ ట్రస్టుపై హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు సైతం ఇచ్చింది. ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచి అశోక్‌గజపతిరాజుపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయకుండా వెంటనే అదుపులో పెట్టాలని లేఖలో సీఎంకు విజ్ఞప్తి చేశారు. చూడాలి మరి దీని పై వైసీపీ నాయకులూ ఎలా స్పందిస్తారు అనేది.
previous post
next post


ఎన్నికలు ఎదుర్కోవడానికి వైసీపీ భయపడుతోంది: యనమల