మన దేశంలో ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా కు వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ ను దశల వారీగా ఇస్తున్న సమయంలో దేశ వ్యాప్తంగా మే 1 నుంచి 18 సంవత్సరాలు దాటిన అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్న విషయం తెలిసిందే. అయితే వారికి కూడా ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు జగన్ ప్రకటించారు. వ్యాక్సిన్ సరఫరా విషయమై సీఎం జగన్ ఇప్పటికే భారత్ బయోటెక్, హెటెరో డ్రగ్స్ ఎండీలకు ఫోన్ చేసి మాట్లాడారు. అలాగే 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వలని ఆ మేరకు కోవిడ్ వాక్సిన్లకు ఆర్డర్ పెట్టమని సీఎం ఆదేశించారని అన్నారు. రాష్ట్రంలో 18–45 వయసులో మొత్తం 2,04,70,364 మంది ఉన్నారని మే 1 నుంచి 18–45 ఏళ్ల మధ్య ఉన్న వారందరికీ కోవిడ్ వాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అయితే చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.
							previous post
						
						
					
							next post
						
						
					

