telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏబీవీకి పోలీసుశాఖ కౌంట‌ర్…

వైస్ వివేకా హత్య సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీవీ ఈ కేసు విచారణలో సీబీఐ అచేతనత్వంతో ఉందని.. సీబీఐ విచారణ మొదలై ఏడాది గడిచినా కేసు దర్యాప్తులో పురోగతి లేదని సీబీఐ దృష్టికి తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే కాగా.. వివేకా హత్యకేసు సమాచారం ఉందని సీబీఐకి రెండుసార్లు తెలిపాన‌ని.. అయినా స్పందించ‌లేద‌ని పేర్కొన్నారు.. అయితే, వెంక‌టేశ్వ‌ర‌రావు లేఖ‌కు కౌంట‌ర్ ఇచ్చింది ఏపీ పోలీసులు శాఖ‌.. డీజీపీ, ఇతర పోలీసు అధికారుల పైనా.. వివేకా హత్య విషయంలో ఏబీ వెంకటేశ్వరరావు రాసిన లేఖపై స్పందించిన డీఐజీ పాల్ రాజు.. వివేకా హత్య కేసులో ఆధారాల్లేకున్నా.. జగన్ కుటుంబ సభ్యులు, బంధువులను అరెస్ట్ చేయాలని ఒత్తిడి చేశార‌ని.. కృత్రిమ డాక్యుమెంట్ల సృష్టిచారంటూ డీజీపీపై ఏబీ నిరాధార ఆరోపణలు చేశారంటూ కౌంట‌ర్ ఎటాక్ చేశారు.  నాడు వైఎస్ వివేకా హత్య దర్యాప్తు అంతా ఏబీ వెంకటేశ్వరరావు కనుసన్నల్లోనే జ‌రిగింద‌న్నారు పాల్ రాజు.. ఏబీవీ ఇచ్చిన సమాచారంతోనే నాడు చంద్రబాబు ప్రతి రోజూ మీడియాతో మాట్లాడేవార‌న్న ఆయ‌న‌.. తన వద్దనున్న కీలక సమాచారాన్ని నాడే ఏబీ వెంకటేశ్వరరావు సిట్ కు ఎందుకు ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించారు.

Related posts