telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఈ ఏడాది కూడా శ్రీరామ నవమి లేనట్టేనా..?

badrachalam srirama as jaganmohini

గతేడాది కరోనా కారణంగా నవమి వేడుకలను నిర్వహించలేదు.  అంతా బాగుంటే వచ్చే ఏడాది పండుగ చేసుకుందామని, ఎవరూ కూడా బయటకు రాకుండా ఇళ్లల్లోనే జరుపుకోవాలని గతేడాది కేంద్రం కోరింది.  ఏడాది గడిచిపోయింది.  ఇప్పుడు మళ్ళీ కరోనా విజృంభిస్తోంది.  గతేడాది కంటే ఈసారి కరోనా రెట్టించిన వేగంతో విజృంభిస్తోంది. కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి.  ఈ నేపథ్యంలో ఈసారి కూడా నవమి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.  ఇప్పటికే అనేక దేవాలయాలను కరోనా కారణంగా మూసివేశారు.  నిత్యకైంకర్యాలను యథావిధిగా నిర్వహిస్తున్నారు.  భక్తుల ప్రవేశానికి అనుమతి ఇవ్వడం లేదు.  ఆంధ్రప్రదేశ్ లో ఒంటిమిట్ట దేవాలయంలో నవమి వేడుకల్ని నిరాడంబరంగా నిర్వహించబోతున్నారు.  ఈసారి కూడా ఎవరి ఇళ్లల్లోనే వారు పండుగ జరుపుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. చూడాలి మరి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది.

Related posts