ప్రస్తుతం భారత రిజర్వ్ బెంచ్ పటిష్టంగా ఉందని సీనియర్ పేసర్ షమీ తెలిపాడు. ఆస్ట్రేలియాలో చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయంలో జూనియర్ బౌలర్ల ప్రదర్శనే నిదర్శనమని తెలిపాడు. మణికట్టు గాయం కారణంగా అడిలైడ్ టెస్ట్ తర్వాత ఆసీస్ పర్యటన నుంచి షమీ తప్పుకున్నాడు. అయితే తాజాగా మహ్మద్ షమీ మాట్లాడుతూ…’మేం రిటైరయ్యే సమయానికి బాధ్యతలు స్వీకరించేందుకు యువ బౌలర్లు సిద్ధంగా ఉంటారు. ఎంత ఎక్కువగా ఆడితే అంత బాగా రాటుదేలుతారు. పేరున్న ఆటగాడు రిటైరైనా జట్టు ఇబ్బంది పడబోదు. ఇప్పుడు రిజర్వ్ బెంచ్ పటిష్టంగా ఉంది’ అని అన్నాడు. అయితే ఆటలో అనుభవం ఎల్లప్పుడూ అవసరమే. త్వరలోనే యువ ఆటగాళ్లు అనుభవం సంపాదిస్తారు. బయో బబుల్ వాతావరణం నేపథ్యంలో నెట్ బౌలర్లుగా తీసుకెళ్లడం యువ ఆటగాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. జాతీయ జట్టులోకి వచ్చాక వారు భయం లేకుండా బౌలింగ్ చేయగలుగుతారు. కొందరు ఆటగాళ్లను ఇప్పటికే మనం చూస్తున్నాం. అని మహ్మద్ షమీ పేర్కొన్నాడు. అయితే మరో వారం రోజుల్లో ఐపీఎల్ 2021 ప్రారంభం కానుంది. అయితే ఈ లీగ్ లో కింగ్స్ పంజాబ్ తరఫున షమీ ఆడుతున్న విషయం తెలిసిందే.
							previous post
						
						
					


జగన్ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు: విడదల రజని