తిరుపతి లోక్సభ స్థానం ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి జగన్ పార్టీ సీనియర్ నేతలతో గత ఏడాది నవంబర్ నెలలో భేటీ నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమీక్ష జరిపారు. అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థిగా ప్రతిపాదించారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. తాజాగా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే వైసీపీ వెలువరించింది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగాగురుమూర్తి పేరును ఖరారు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరైనా పదవిలో ఉండగా చనిపోతే.. ఉపఎన్నికలో ఆ నాయకుడి కుటుంబంలోని వారికి టికెట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే వివిధ కారణాల వల్ల వైసీపీ మాత్రం బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబంలోని వారికి కాకుండా వేరేవాళ్లకి టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది.
							previous post
						
						
					
							next post
						
						
					

