telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

దూసుకపోతున్న గోపీచంద్ జ్వాలారెడ్డి…

తనదైన నటనతో హీరో గోపీచంద్ అందరినీ ఆకట్టుకున్నారు. అయితే గత కొంతకాలంగా గోపీచంద్ సరైన హిట్ లేక సతమతమవుతున్నారు. ఎలాగైనా మంచి విజయం అందుకొని హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు. అందులో భాగంగా గోపీచంద్ వరుస సినిమాలను ఓకే చేశారు. తాజాగా గోపీచంద్ నటించిన సినిమా సీటీమార్. ఈ సినిమా ఏప్రిల్2న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా నుంచి వరుస అప్‌డేట్‌లను ఇస్తున్నారు. అయితే నిన్న ఈ సినిమా నుండి ”జ్వాలారెడ్డి” పాటను హీరో రామ్ విడుదల చేసాడు. అయితే ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో వన్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి దూసుకపోతుంది. అయితే ఈ సినిమా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో గోపీచంద్ కబడ్డీ మహిళా టీమ్ కోచ్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే మరో టీమ్ కోచ్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్నారు. వీరితో పాటుగా భూమికా చావ్లా, రావు రమేష్, తరుణ్ అరోరా, రెహ్మాన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాని సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. మరి సినిమా అభిమానులను అనుకున్న స్థాయిలో అలరిస్తుందేమో వేచి చూడాలి.

Related posts