ఐపీఎల్ 2021 మొత్తం సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ కు అందుబాటులో ఉండటానికి బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఏప్రిల్‌లో శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ ను ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. దాంతో అతనికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్రికెట్ ఆపరేషన్ చైర్మన్ అక్రమ్ ఖాన్ అనుమతి ఇచ్చారు. కానీ ఈ టెస్ట్ సిరీస్‌కు ముందు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బంగ్లా జట్టుకు షకీబ్ అందుబాటులో ఉండనున్నాడు. అయితే “ఐపీఎల్ లో పాల్గొనాలని కోరుకుంటున్నందున శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆడకూడదని అనుకుంటున్నట్లు షకీబ్ ఇటీవల మాకు ఒక లేఖ ఇచ్చారు” అని అక్రమ్ అన్నారు. దాంతో ఆడటానికి ఆసక్తి లేని వ్యక్తిని జాతీయ జట్టుకు ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదని మేము అతనికి అనుమతి ఇచ్చాము” అని అక్రమ్ చెప్పాడు. అయితే నిన్న జరిగిన ఐపీఎల్ 2021 వేలంలో రూ .3.2 కోట్లకు షకీబ్ ను తన కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలుచేసి విషయం తెలిసిందే. అయితే గౌతమ్ గంభీర్ నాయకత్వంలో టైటిల్ గెలుచుకున్న 2012 మరియు 2014 కేకేఆర్ జట్లలో అతను సభ్యుడు. అయితే షకీబ్ అల్ హసన్ ఏడాది విరామం తర్వాత ఐపీఎల్‌కు తిరిగి వస్తున్నాడు. ఇప్పటివరకు 63 ఇప్పల్ మ్యాచ్‌లు ఆడిన అతను 126.66 స్ట్రైక్ రేట్లో 746 పరుగులు చేశాడు మరియు 7.46 ఎకనామితో 59 వికెట్లు తీసుకున్నాడు.
							previous post
						
						
					


ఓట్ల కోసమే ఈబీసీ రిజర్వేషన్ బిల్లు: టీడీపీ ఎంపీ సీతారామలక్ష్మి