కరోనా మహమ్మారి సమయంలో వాలెంటీర్లుగా పనిచేసిన వారిని ‘సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్’ గచ్చిబౌలి సంధ్య కన్వెక్షన్ హాల్లో బుధవారం సత్కరించింది. ఈ సందర్భంగా సోనూసూద్‌ను సీపీ సజ్జనార్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్, సింగర్ స్మిత, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి కృష్ణ యోదుల తదితరులు పాల్గొన్నారు. అయితే బాలీవుడ్ నటుడు సోనూ సూద్… సినిమాల్లో విలన్‌గా కనిపించినప్పటికీ ఇప్పుడు అందరి దృష్టిలో హీరో అయ్యాడు. రీల్ హీరో నుండి రియల్ హీరో గా మారిన సోనూసూద్ కరోనా లాక్ డౌన్ కు ముందు సినిమాలో విలన్ గా మాత్రమే అందరికి పరిచయమున్న సోనూ సూద్ ఈ లాక్ డౌన్ లో తాను చేసిన పనులతో హీరో గా మారిపోయారు. లాక్డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్న వారికి విశేషమైన సేవలందించి రియల్ హీరోగా నిలిచాడు సోనూ సూద్. ఈ నేపథ్యంలో ఓ అభిమాని సోనూ సూద్‌కి ఏకంగా గుడి కట్టేసారు. అది కూడా తన సొంత ఖర్చుతో సోనూ సూద్‌కు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు ఆ అభిమాని. ఇది ఎక్కడో కాదు… సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బ తండా పరిధిలోని చెలిమితండాలో సోనూ సూద్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు.
previous post
next post
ఎన్టీఆర్ చాలా మారిపోయాడు… శ్రియ కామెంట్స్