పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వకీల్ సాబ్ షూటింగ్ పూర్తయింది. పవన్ 27వ సినిమా క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పవన్ పుట్టిన రోజు సందర్భంగా గతేడాది సెప్టెంబర్ 2న ప్రీలుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. ఆ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతుంది ఈ మూవీ. ఈ సినిమాలో పవన్ హరిహర వీరమల్లు పాత్రలో కనిపించనున్నారని టాక్. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ నటిస్తోందని.. ఇప్పటికే ఆమెతో కొన్ని సన్ని వేశాలను కూడా చిత్రీకరించినట్లుగా తాజాగా సమాచారం అందుతోంది. భారీ బడ్డెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ మహారాణి పాత్రలో నిధి కనిపించనుందట. కెరీర్ పరంగా ఆమెకు ఈ ఛాన్స్ బిగ్ బ్రేక్ అనే చెప్పాలి. ఓ స్టార్ హీరోతో నటించడం నిధికి ఇదే ఫస్ట్ టైమ్.