ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. షెడ్యూల్ ప్రకారం తొలివిడతకు ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. మొదటి విడతలో 11 జిల్లాలోని 14 రెవెన్యూ డివిజన్లలో ఎన్నికలు జరుగనున్నాయి. కానీ ఇప్పటి వరకు పంచాయతీ నామినేషన్లు మొదలుకాలేదు. అటు అధికారులు నామినేషన్ల స్వీకరణకు అధికారులు సిద్ధం కాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి రాజకీయాలు చేయకూడదని ఎస్ఈసీ నిమ్మగడ్డకు హితవు పలికారు. ఆయన వెనక ఎవరో అదృశ్య శక్తి ఉండి నడిపిస్తున్నారని ఆరోపణలు చేశారు. పరిస్థితులను బట్టి ఎన్నికలు నిర్వహించాలి తప్ప… రచ్చ చేయడం మానేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రతిష్టంభన దేశంలోనే మొదటిసారి చూస్తున్నా అంటూ నిమ్మగడ్డ వ్యవహారశైలిని విమర్శించారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయండి… అవకాశం ఉంటే సలహాలు ఇవ్వాలని సూచించారు ముద్రగడ.
previous post


కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి .. తన దగ్గర ఓ మెడిసిన్ ఉంది: జగ్గారెడ్డి