సెక్రటరీ గిరిజా శంకర్, ప్రత్యేక కమిషనర్ పి.అర్జునరావు, ఎస్.ఈ ఎ.శ్రీనివాస్, రీజనల్ జాయింట్ కమిషనర్ భ్రమరాంబ, డీఈలతో మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్ష అనంతరం వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయనగరం జిల్లా రామతీర్థం రూ.3 కోట్ల వ్యయంతో పునఃనిర్మాణం చేస్తున్నామని ఆయన అన్నారు. రామతీర్థం పునః నిర్మాణ పనులు ఏడాదిలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. విజయనగరంజిల్లా శ్రీ రామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి, పునః నిర్మాణానికి రూ.3 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని ఆయన అన్నారు. రామతీర్థానికి సంబంధించి పండితుల సలహాలు, వైఖాసన ఆగమ సంప్రదాయం ప్రకారం ఆలయ అభివృద్ధి, పునఃనిర్మాణంపై చర్చ జరగనున్నట్టు పేర్కొన్నారు. 700 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయ నిర్మాణం పూర్తి రాతి కట్టడాలతో జరగనుందని అన్నారు. కోదండ రాముని విగ్రహాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు తయారు చేసి అందజేయనున్నారన్న ఆయన రామతీర్థం మెట్ల మార్గం సరిచేయడంతో పాటు నూతన మెట్లు నిర్మాణం చేపడతామని అన్నారు. దేవాలయ పరిసరాల ప్రాంతం మొత్తం విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేస్తామని, శాశ్వత నీటి వసతి, కోనేటిని శుభ్రపర్చటం, కోనేటి చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు, ప్రాకార నిర్మాణం కూడా చేస్తామని అన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.


టీడీపీ ఉక్కు పరిశ్రమను రాజకీయంగా వాడుకుంది: కన్నా