telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌ ప్రభుత్వానికి కోదండరాం వార్నింగ్‌..

Kodandaram

కేసీఆర్‌ ప్రభుత్వానికి టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం వార్నింగ్‌ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ధర్నా చౌక్ వద్ద దీక్ష చేస్తామని పోలీసుల పర్మిషన్ కోరామని… వారం రోజుల నుంచి నాన్చివేత ధోరణి అవలంభిస్తూ.. రాత్రి అనుమతి ఇవ్వడం లేదని చెప్పారని మండిపడ్డారు. మేము దీక్షకు కూర్చుంటే వాస్తవాలు.. ప్రజల్లోకి వెళ్తాయనే భయం పాలకులకు పట్టుకుందన్నారు. నిరుద్యోగ, రైతాంగ సమస్యలపై గత ఆరేళ్లుగా పోరాడుతున్నామని… ప్రభుత్వం స్పంచించకపోవడం వల్లే దీక్ష కు కూర్చున్నాని తెలిపారు. తన దీక్షతోనైన ప్రభుత్వం స్పందించకపోతే.. భవిష్యత్తు కార్యచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు కోదండరాం. అనంతరం సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ… కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో ఉద్యోగాల కోసం మళ్ళీ పోరాటం చేయాల్సి రావడం దురదృష్ట కరమన్నారు. ఉద్యోగాల ఖాళీల పై శ్వేత పత్రం విడుదల చేయాలని… నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తావ్ సీఎం కేసీఆర్ అని నిలదీశారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా.. ప్రశ్నించే హక్కు అందరికి ఉందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని… ధర్నా చౌక్ లో ధర్నా చేయడానికి పర్మిషన్ ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఎన్నికలు హామీలు చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని… అగ్రి చట్టాల పై trs పార్టీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Related posts