telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు..

ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు కేసీఆర్ కు లేదని మండిపడ్డారు. చరిత్రలోనే నూతన వ్యవసాయ చట్టం నల్ల మచ్చ అని… కేంద్రం రైతుల జీవితాలు తాకట్టు పెట్టే విధంగా నూతన వ్యవసాయ చట్టాలు ఉంటే అది ఒక గొప్ప చరిత్రాత్మకంగా నిర్ణయం అనడం ఆశ్ఛర్యం కలిగిస్తోందన్నారు. సాగునీరు పేరుతో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్టంగా మార్చేసిన కేసీఆర్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిజ స్వరూపం ఏంటో ఇప్పుడు బయటపడిందని పేర్కొన్నారు. కేసీఆర్ ముసుకు తొలిగిపోయిందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ మేక వన్నె పులిలా వ్యవహరిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. అక్రమంగా సంపాధించిన వేల కోట్ల రూపాయలను కాపాడుకోవడానికి మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. ఇదేనా నువ్వు ఢిల్లీకి పోయి కుదుర్చుకున్న ఉప్పందం? అని ప్రశ్నించారు జీవన్‌ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర రైతుల భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టాడని పేర్కొన్నారు.

Related posts