telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీ-20 మ్యాచ్‌ను తలపిస్తున్న దుబ్బాక ఫలితాలు…

దుబ్బాక ఉప ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. టీ-20 మ్యాచ్‌ దుబ్బాక ఫలితాలు తలపిస్తున్నాయి. నరాలు తెగే ఉత్కంఠతను నెలకొల్పుతున్నాయి. ఇప్పటికే 21 రౌండ్ల ఫలితాలు పూర్తయ్యాయి.  మరో రెండు రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉన్నది.  మొదటి ఐదు రౌండ్లలో బీజేపీ ఆధిక్యాన్ని కొనసాగించగా, ఆరు,ఏడు రౌండ్లు తెరాస పార్టీ ఆధిక్యాన్ని కొనసాగించింది.  అయితే, 8,9 రౌండ్లలో ఆధిక్యం కొనసాగించగా, 10వ రౌండ్లో బీజేపీ తిరిగి ఆధిక్యాన్ని కొనసాగించింది.  ఆ తరువాత టీఆర్‌ఎస్‌ వరుసగా ఆధిక్యాన్ని కొనసాగించింది.  అయితే, చివర్లో తెరాస పార్టీ పుంజుకుంటుందని అనుకుంటే… బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది.  ప్రసుత్తం 21 రౌండ్లు ముగిశాయి.  22&23 రౌండ్లు మిగిలాయి ఇప్పటికి బీజేపీ లీడ్ 620గా ఉంది. నువ్వా నేనా అన్నట్టుగా పోటీ జరుగుతున్నది. తుది ఫలితం వచ్చే వరకు వేచి చూడాల్సిందే..అటు టీఆర్‌ఎస్‌, ఇటు బీజేపీ లీడర్లు మాత్రం తామదే విజయమని అంటున్నారు. కానీ ఇంకో రెండు చోట్ల కౌంటింగ్‌ ఉంది. అక్కడ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో అని చూడాలి. 

Related posts