తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో బీఆర్కే భవన్లో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలకు సంబంధించి అధికారుల నుంచి వివరాలను సోమేశ్ సేకరిస్తున్నారు. అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్‌తో సీఎస్ భేటీ కానున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచనపై సీఎంతో కీలకంగా చర్చించనున్నట్లు సమాచారం. అయితే ప్యాస్తుతం తెలంగాణలో రోజు వేలలో కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఇక మన పక్క రాష్ట్రలో వారాంతపు లాక్ డౌన్ విధించారు. చూడాలి మరి ఈ సమావేశంలో కేసీఆర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు అనేది.
అమరావతి రాజధానిని జగన్ అప్పట్లో ఆమోదించారు: సీపీఐ నారాయణ