telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణకు టీఆర్ఎస్ వద్దు.. బీజేపీనే ముద్దు

dk-aruna

గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి 75 స్థానాల్లో గెలుస్తుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ అన్నారు. వంద డివిజన్లలో గెలుపే లక్ష్యంగా బిజెపి రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ముందుకెళుతున్నదని ఆమె పేర్కొన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మైనర్ దేవర పల్లి టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ తోకలు శ్రీనివాస్ రెడ్డి పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కలసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డికె అరుణ మాట్లాడుతూ… ఇంటి పక్కన ఉన్న దుబ్బాక ప్రజలే కేసీఆర్ మాటలు నమ్మటం లేదని… కేసీఆర్ ను ఫాంహౌస్ కే పరిమితం చేయాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని ఎద్దేవా చేశారు. ఓట్లు అడగటానికి వస్తే.. టీఆర్ఎస్ నాయకులను ప్రజలు తగిన బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారని..జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకమని పేర్కొన్నారు. అన్నీ కేంద్రం ఇస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఏమి చేస్తది? కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. హైద్రాబాద్ నగర అభివృద్ధిపై హామీలు ఇచ్చింది కేసీఆరా? ప్రధాని మోదీనా? అని నిలదీశారు. తెలంగాణకు టీఆర్ఎస్ వద్దు.. బీజేపీనే ముద్దు అని.. హైదరాబాద్ అభివృద్ధిపై టీఆర్ఎస్ జూఠా మాటలు చెప్పిందని ఫైర్‌ అయ్యారు. వరద బాధితులను సీఎం పరామర్శించకపోవటం బాధ్యతారాహిత్యమని…కేంద్రం నిధులను ప్రాజెక్టుల పేరుతో సీఎం కేసీఆర్ దోచుకుంటున్నాడని ఆరోపణలు చేశారు. నియంత నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.

Related posts