telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన స్క్రీన్‌పై కింగ్ ఖాన్ కు బర్త్ డే విషెస్

SRk

నవంబర్ 2న బాలీవుడ్‌ బాద్‌షా‌ షారుక్‌ ఖాన్ పుట్టినరోజు. ఆయన 56వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమనులు సోషల్‌ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం షారుక్‌ యూఏఈలో ఉన్నారు. అక్కడ జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌) తన జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మద్దతు ఇస్తున్నారు. కాగా షారుక్ బర్త్‌డే సందర్భంగా దుబాయ్‌లోని ప్రముఖ బూర్జ్ ఖలీఫా ఆయనకు విషెస్ చెప్పింది. షారుక్ ఫొటోలతో కింగ్ ఆఫ్ బాలీవుడ్‌, హ్యాపీ బర్త్‌డే షారుక్ ఖాన్ అంటూ బాద్‌షాపై ప్రత్యేక ప్రేమను చాటారు. గతేడాది కూడా బూర్జ్‌ ఖలీఫా షారూక్‌కి ఇలాంటి ట్రిబ్యూనే ఇచ్చారు. అయితే అప్పుడు షారుక్ ఇండియాలోనే ఉన్నారు. కానీ ఈసారి ఆ ట్రిబ్యూట్‌ని దగ్గరుండి వీక్షించారు కింగ్‌ఖాన్‌. ఈ సందర్భంగా అక్కడ తీసుకున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన స్క్రీన్‌పై నన్ను చూసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా తదుపరి సినిమా స్క్రీన్‌ మీద రాకముందే మొహమ్మద్ అలబ్బర్ నన్ను స్క్రీన్‌పై చూపించారు. థ్యాంక్యు అండ్ లవ్యూ. నా పిల్లలు దీన్ని చూసి ఎంతో ఇంప్రైస్ అయ్యారు” అని తెలిపారు షారుక్. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఇక షారుక్‌ తన 30 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 90 చిత్రాల్లో నటించారు. చిత్ర పరిశ్రమలోని అందరి హీరోయిన్లతో కలిసి పని చేశారు. అయితే గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ లు అందుకుంటున్న షారుక్ “జీరో” తరువాత ఇప్పటి వరకు మరో సినిమాలో నటించలేదు.

Related posts