telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్

Prince

బిగ్ బాస్ ఫేం, సినీ న‌టుడు ప్రిన్స్ సుశాంత్ నీకు నాకు డాష్ డాష్ , బస్ స్టాప్, రొమాన్స్, వేర్ ఈజ్ విద్యాబాలన్ వంటి చిత్రాలతో నటించిన విషయం తెలిసిందే. కాగా ఆయన ఈ నెల 24 ఆదివారం హైద‌రాబాద్ బాచుప‌ల్లి స‌మీపంలో గ‌ల విఎన్ఆర్ కాలేజ్ స‌మీపంలో నిర్వ‌హించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో ప‌ట్టుబ‌డ్డారు. మోతాదుకి మించి తాగ‌డంతో ఆయ‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ క్ర‌మంలో నేడు ప్రిన్స్ కూక‌ట్ ప‌ల్లి కోర్టుకు హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది. యాక్ట్ ప్ర‌కారం ప్రిన్స్‌కి జ‌రిమానా విధించ‌డంతో పాటు జ‌డ్జి గ‌ట్టిగా మంద‌లించిన‌ట్టు స‌మాచారం. చేసిన త‌ప్పుని ఒప్పుకున్న ప్రిన్స్ మ‌రోసారి ఇలాంటివి రిపీట్ చేయ‌న‌ని చెప్పార‌ట‌. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Related posts