telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఒకేసారి 3 సినిమాలు ప్రకటించిన యువ వ్యాపారవేత్త

p19

ప్రముఖ వ్యాపారవేత్త సురేష్‌రెడ్డి ఇప్పుడు టాలీవుడ్ లోకి ప్రవేశించారు. ‘పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌’ సంస్థను స్థాపించిన ఆయన, శుక్రవారం నాడు మూడు చిత్రాలను ప్రకటించారు. ‘పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌’లో ప్రొడక్షన్‌ నెం.1గా రూపొందనున్న చిత్రానికి ‘సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌’, ‘పేపర్‌ బోయ్‌’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ఆకాష్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ‘ఛోరి’, ‘మరోజన్మ’, ‘ప్యూర్‌ సోల్‌’ వంటి అవార్డ్‌ విన్నింగ్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌ రూపొందించిన ఆకాష్‌రెడ్డి, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

‘పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌’లో ప్రొడక్షన్‌ నెం.2గా రూపొందనున్న చిత్రానికి ఉత్తమ కథారచయితగా ‘ఋషి’కి గాను నంది పురస్కారంతో పాటు దర్శకుడిగా దాదా సాహెబ్‌ ఫాల్కె ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పురస్కారం అందుకున్న రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహించనున్నారు. ‘ఋషి’ చిత్రానికి పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. ‘ఆంధ్రాపోరి’, ‘ఐతే 2.0’ చిత్రాలకు రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఎన్నారై రవికాంత్‌ జామితో కలిసి సురేష్‌రెడ్డి కొవ్వూరి నిర్మించనున్నారు.

‘పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌’లో ప్రొడక్షన్‌ నెం.3గా రూపొందనున్న చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్‌ శిష్యుడు, ఆయన దగ్గర ఆరు చిత్రాలకు పని చేసిన ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వం వహించనున్నారు. ఇంతకు ముందు ‘పెళ్ళి గోల’ వెబ్‌ సిరీస్‌, జీ5 ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదలైన ‘47 డేస్‌’ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు రమేష్‌ ప్రసాద్‌ సమర్పకులు.

ఇక కొవ్వూరి సురేష్‌రెడ్డి యానిమేషన్‌ గేమింగ్ రంగంలో, ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార పత్రిక ఫోర్బ్స్‌ ఇటీవల ప్రకటించిన 30 ఏళ్ళ లోపు వయసు గల అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్న యువ వ్యాపారవేత్త, ఏకైక తెలుగు వ్యక్తి సురేష్‌రెడ్డి. గత 13 ఏళ్ళుగా ‘క్రియేటివ్‌ మెంటార్స్‌ యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ కాలేజీ’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా ఉన్నారు. ఆ కాలేజీ వ్యవస్థాపకులు ఆయనే. అలాగే, ప్రసాద్ ల్యాబ్స్ సహకారంతో ఫిలిం స్కూల్ నిర్వహిస్తున్నారు.

Related posts