సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… ఓ వైపు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ప్రకటించాలని పోరాడుతుంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్థాననడం హాస్యాస్పదం అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో బేటీ పడవో బేటీ బచావో నినాదాలకే పరిమితం అయింది.. కేంద్రంలో బీజేపీ వచ్చినప్పటి నుండి రోజు దేశంలో ఏదో ఒక మూల అమ్మాయిల పై హత్యాచారాలు, హత్యలు పెరిగాయి అని తెలిపారు. మతోన్మాద పార్టీ శక్తుల భరతం పట్టే రోజు వస్తుంది అని హెచ్చరించారు. నిరుద్యోగ భృతి, డబల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని కేసీఆర్ మాటలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ఇలాంటి ద్రోహులను మనం చట్ట సభల్లో కూర్చోనీచ్చాం.. ప్రజలు ఇప్పటికయినా చైతన్య వంతులు కావాలి అన్నారు. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం మొదలైన గడ్డ నుంచే వామపక్ష పార్టీల కూటములు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమరాన్ని ప్రారంభించడం సంతోషం ఏమో తెలిపారు. వామపక్ష పార్టీలు బలపరచిన వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి జయ సారధి రెడ్డిని గెలిపించాలి అని సూచించారు.
							previous post
						
						
					
							next post
						
						
					


ఏపీలో మతమార్పిళ్లు తప్ప మరేం జరగడం లేదు: కన్నా