ఈ మార్చి 14న తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకోసం భారీగా నామినేషన్లు వచ్చాయి. అయితే నిన్నటితో ఈ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోయింది… దీంతో.. ఫైనల్‌గా బరిలోఉన్న అభ్యర్థులు ఎవరో ప్రకటించేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఫైనల్‌గా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు మరోసారి బరిలోకి దిగగా.. టీఆర్ఎస్ నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణిదేవి, కాంగ్రెస్ పార్టీ నుంచి చిన్నారెడ్డి బరిలో ఉండగా.. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.. ఆయనకు వాపక్షాలు, ఇతర ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. వీరితో పాటు మొత్త్ం 93 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.. ఇక, మార్చి 17వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. చూడాలి మరి ఈ ఎన్నికల్లో ఎవరు వియజయం సాధిస్తారు అనేది.
previous post
next post