telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు

ఫిబ్రవరి 27 శనివారం దినఫలాలు

మేషం : అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారు అచ్చు తప్పులు పడుట వల్ల మాటపడక తప్పదు. ప్రయాణాలు అనుకూలం. ఆకస్మికంగా ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. సోదరీ, సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులకు ఒత్తిడి, అవగాహనం లోపం వంటి చికాకులు తప్పవు.

 

వృషభం : కొన్ని సమస్యల పరిష్కారానికి గత అనుభవాలు తోడ్పడతాయి. ఇంజనీరింగ్, వైద్య విద్యార్థులకు ఏకాగ్రత, పట్టుదల ముఖ్యం. పెద్ల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందుకు గురిచేస్తుంది. రుణదాతల ఒత్తిడి, ఏ పనీ సక్రమంగా సాగక నిరుత్సాహం చెందుతారు.

 

మిథునం : భాగస్వామిక చర్చల్లో కొత్ ప్రతిపాదనలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను వీలైనం త్వరగా పూర్తి చేసుకోవడం మంచిది. కళాకారులకు గౌరవం లభిస్తుంది. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పిడి, స్థానచలనం వంటి పరిణామాలున్నాయి.

 

కర్కాటకం : ఆర్థికంగా లోటు లేకున్నా తెలియని అసంతృప్తి వెన్నాడుతుంది. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కుటుంబీకులతో అవగాహన కుదురుతుంది. బ్యాంకు వ్యవహారాలలోనూ, ప్రయాణాలలో మెళకువ అవసరం. వృత్తుల వారికి ప్రజాసంబంధాలు మెరుగుపడటంతో పాటు అవకాశాలు కలిసివస్తాయి.

 

సింహం : స్త్రీలకు దైవ, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మితంగా సంభాషిస్తూ మీ ప్రత్యర్థుల జోరును పెరగకుండా చూడండి. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థలలోని వారికి ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. మధ్యవర్తిత్వం వహించడం వల్ల మాటపడవలసి వస్తుంది.

 

కన్య : ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు తప్పవు. తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరిక వాయిదా వేసుకోవలసి వస్తుంది. మీ లక్ష్య సాధనకు మరింతగా శ్రమించవలసి ఉంటుంది. ఖర్చులు మీ స్తోమతకు తగినట్టే ఉంటాయి.

 

తుల : వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సత్ఫలితాలు సాధిస్తారు. స్త్రీలలో సంపాదన పట్ల ఆసక్తి మరింత బలపడుతుంది. ఆడిట్, అకౌంట్స్, కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఉద్యోగస్తులకు రావలసిన మెడికల్ క్లయింలు, అలవెన్సులు అందుతాయి. మిత్రులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు.

 

వృశ్చికం : స్త్రీల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శారీరకపటుత్వం నెలకొంటుంది. విద్యార్థినులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత నెలకొంటుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

 

ధనస్సు : బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారమయ్యే సూచలున్నాయి. కళ, క్రీడా, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత, కొత్త బాధ్యతలు తప్పవు.

 

మకరం : పారిశ్రామికవేత్తలు, ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. స్త్రీలకు ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. స్వర్ణకార వృత్తుల వారు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం మంచిది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు మందకొడిగా సాగుతాయి.

 

కుంభం : శారక శ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. మీ పాత సమస్యలు పరిష్కారమవుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో అనుభవజ్ఞులతో సంప్రదించండి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగి లాభాలు అనుభవం గడిస్తారు. రాజకీయ నాయకుల సభలు, సమావేశాలు వాయిదాపడతాయి.

 

మీనం : వస్త్ర, స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఇసుక, క్వారీ, కాంట్రాక్టర్లకు అధికారులతో కొత్త సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు అవకాశం చేజారిపోతుంది. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీలకు షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం.

Related posts