telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

73 సంవత్సరాల “పాతాళభైరవి” (తమిళ్)

నందమూరి తారకరామారావు గారు నటించిన తమిళ చిత్రం విజయా వారి “పాతాళభైరవి” (తమిళ్) సినిమా 17-05 1951 విడుదలయ్యింది

నిర్మాతలు బి.నాగిరెడ్డి,చక్రపాణి లు విజయా ప్రొడక్షన్స్ లిమిటెడ్ బ్యానర్ పై ప్రముఖ దర్శకులు కె.వి.రెడ్డి గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రాన్నికి స్క్రీన్ ప్లే: కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, పాటలు: తంజై ఎన్ రామయ్యదాస్, . సంగీతం: ఘంటసాల అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు, మాలతి, రేలంగి, గిరిజ, పద్మనాభం, సురభి కమలాబాయి, లక్ష్మీ కాంతం, వంగర బాలకృష్ణ, సి.ఎస్.ఆర్., హేమలత, టి.జి.కమలాదేవి, చిట్టి, తదితరులు నటించగా కృష్ణకుమారి, సావిత్రి గెస్ట్ పాత్రలలో నటించారు.

“పాతాళ బైరవి” సినిమాను తెలుగు,తమిళ భాష లలో సమాంతరంగా ఒకేసారి నిర్మించారు. తెలుగు సినిమా 15-03-1951 న విడుదల కాగా తమిళ చిత్రం 17-05-1951 వ తేదీన విడుదలైనది.

ఈ సినిమాను జెమిని వాసన్ హిందీ లోకి డబ్బింగ్ చేసి 1952 లో విడుదల చేశారు. ఈ సినిమా 3 భాషల్లోనూ ఘన విజయం సాధించింది.

ఈ చిత్రం తెలుగు లో సూపర్ డూపర్ హిట్ అయ్యి చరిత్ర సృష్టించగా తమిళం లో కూడా విజయవంతమై
శతదినోత్సవాలు జరుపుకున్నది.

మద్రాస్ – శ్రీకృష్ణాలో 100 రోజులు ప్రదర్శింపబడింది..

మద్రాసు – శ్రీకృష్ణా థియేటర్ లో పాతాళ భైరవి తమిళ్ సినిమా100 రోజులు ఆడింది.

మద్రాసు పట్టణంలోని ఒకే థియేటర్లో ఒక హీరో నటించిన జానపద చిత్రం తొలుత తమిళ చిత్రం శతదినోత్సవం జరుపుకున్న వెంటనే ఆ చిత్రం తెలుగు వెర్షన్ విడుదలై అది కూడా వందరోజులు ఆడటం అనేది నభూతో నభవిష్యతి.

అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఏకైక నటుడు నందమూరి తారక రామారావు గారు

ఈ రికార్డు నేటివరకూ వేరెవ్వరికి సాధ్యం కాలేదు, ఆఘనత, ఆ చరిత్ర ఒక్క ఎన్.టి.ఆర్. గారికే దక్కింది..

Related posts