telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఎన్.టి.రామారావు గారు నటించిన 64 సంవత్సరాల “ఆటగాడు”

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం శ్రీ వెంకటేశ్వర మూవీ క్రియేషన్స్ వారి “ఆటగాడు” 24-04-1980 విడుదలయ్యింది.

నిర్మాత జి.రాజేంద్రప్రసాద్ శ్రీ వెంకటేశ్వర మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రాన్నికి కధ, స్క్రీన్ ప్లే: ఎం.డి.సుందరం, మాటలు: సత్యానంద్, పాటలు: వేటూరి సుందర రామమూర్తి, సంగీతం: చక్రవర్తి, ఫోటోగ్రఫీ: కన్నప్ప, కళ: కుదరవల్లి నాగేశ్వరరావు, నృత్యం: హీరాలాల్, ఎడిటింగ్: కృష్ణ స్వామి అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, శ్రీదేవి, జగ్గయ్య, సత్యనారాయణ, రావు గోపాలరావు, అల్లురామలింగయ్య, పుష్ఫలత, అత్తిలి లక్ష్మి, జయమాలిని,.ప్రభాకర్ రెడ్డి, నూతన్ ప్రసాద్, చలపతిరావు, పద్మనాభం తదితరులు నటించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు స్వరచక్రవర్తి గారి సంగీత సారధ్యంలో వెలువడినపాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
“చీమ కుట్టిందా చిరుబురు లాడిందా”
“జిల్ జిల్ జిలేబీ నా గులాబీ నేనాడనా”
“ఏకో నారాయణ ఏలుకో నా మోహనా”
“చిలకమ్మ గూటిలో సోటుందిరా”
“గుద్దూతా నీయవ్వ గుద్దుతా”
వంటి పాటలు ప్రేక్షకులను అలరించాయి.

ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆరోజులలోనే కోటిన్నర పైగా వసూలు చేసింది.

కాగా ఈ చిత్రం విజయవాడ, గుంటూరు, హైదరాబాద్. లతో పాటు పలు కేంద్రాలలో 50 రోజులు పైగా ప్రదర్శింపబడి 7 కేంద్రాల్లో 100 రోజులు (షిఫ్టుల మీద) శతదినోత్సవం జరుపుకున్నది.

ఈ చిత్రం విజయవాడ, గుంటూరు,మచిలీపట్నం, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కేంద్రాలలో (100 రోజులు) శతదినోత్సవం జరుపుకున్నది.

Related posts