భారీ వర్షాలకు గుజరాత్ ప్రజలు అతలాకుతలమవుతున్నారు. పలు ప్రాంతాల్లో వరద నీరు పొంగి పొర్లుతుంది. ఈ క్రమంలో ఖేడా జిల్లాలోని ప్రగతి నగర్లో మూడు అంతస్తుల భవనం భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగిస్తున్నారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
previous post
చంద్రబాబు మౌనీ బాబా అయ్యారు: : విజయసాయి