telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఆక్సిజ‌న్ కొరత కారణంగా మరో ఇద్దరు కరోనా రోగులు మృతి…

కర్నూలులో కే ఎస్ కేర్ ఆస్పత్రిలో ఇవాళ ఆక్సిజ‌న్ అంద‌క ఇద్ద‌రు  కోవిడ్ బాధితులు ప్రాణాలు వ‌దిలారు.. అయితే, ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈ ఆస్ప‌త్రిలో కరోనా ట్రీట్మెంట్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.. ఆక్సిజన్ కొరతతో సొంతంగా బయటి నుంచి ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చుకుంటున్నారు కోవిడ్ రోగులు సహాయకులు.. త‌మ వారిని కాపాడుకునేందుకు త‌ప‌న‌తో ఈ ప‌నిచేస్తున్నారు. కాగా, కోవిడ్ రోగులు మృతిచెంద‌డంతో.. అస‌లు మేం కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వడం లేదంటోంది ఆస్ప‌త్రి యాజ‌మాన్యం.. కేవలం ఐసొలేషన్ ట్రీట్మెంట్ మాత్రమే ఇచ్చామ‌ని.. మా హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరత కొంత ఏర్ప‌డిన మాట వాస్త‌వం అంటున్నారు. అయితే, ఈ ఆస్ప‌త్రిలో మృతిచెందింది.. ఇద్ద‌రు కాదు.. న‌లుగు అనే స‌మాచారం కూడా ఉంది. అయితే ఏపీలో రోజుకు 15 వేలకు పైగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది.

Related posts