టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలను దేశమంతా గమనిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, దీన్ని చంద్రబాబు స్వాగతిస్తారా? లేక పారిపోతారా? అన్న విషయాన్ని ఆయనే తేల్చుకోవాలని అన్నారు.
‘ జగన్ గారు అత్యంత సాహసంతో తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలను దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ప్రలోభాలను తిరస్కరించి అసాధారణ పరిణతిని ప్రదర్శించేందుకు రాష్ట్ర ప్రజానీకం తహతహలాడుతోంది. కమాన్ చంద్రబాబూ..స్వాగతిస్తావో, పలాయనం చిత్తగిస్తావో తేల్చుకోవాల్సింది నువ్వే’ అని ట్వీట్ చేశారు.