నటవారసుఅక్కినేని డు నాగార్జున నటించిన సంచలన చిత్రం ‘శివ’. ఈ చిత్రాన్ని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నాగార్జున సినీ జీవితంలో ఓ మైలు రాయిగా నిలిచింది. ఇండస్ట్రీలోకి అప్పుడే అడుగుపెట్టిన ఆర్జీవీ.. తెలుగు సినీ పరిశ్రమకు కొత్తదనాన్ని పరిచయం చేశాడు. తొలి అవకాశంతోనే.. తనేంటో నిరూపించుకున్నాడు. ‘శివ’ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ అంటుంటారు సినీ విమర్శకులు. ఇళయరాజా బాణీలు అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్. ముఖ్యంగా ‘బోటనీ పాఠముంది.. మ్యాటనీ ఆట ఉంది’, ‘సరసాలు చాలు శ్రీవారు’ పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినపడుతూనే ఉంటాయి. తమిళ్, హిందీలలో విడుదల చేయగా.. అక్కడా సూపర్ హిట్ అయ్యింది. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎంతో మంది కొత్త దర్శకులకు, నటీనటులకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంది. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘శివ’ విడుదలై నేటికి 30 ఏళ్లు. 1989 అక్టోబర్ 5న ఈ సినిమా విడుదలైంది. సైకిల్ చెయిన్‌తో తెలుగు సినీ తెరపై అక్కినేని నటవారసుడు నాగార్జున సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. శివ సినిమాకు 30 ఏళ్లు పూర్తైన సందర్భంగా దర్శకుడు ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘‘నాగార్జునా.. ఇవాళ మన ప్రియమైన బిడ్డ 30వ పుట్టిన రోజు’’ ట్వీట్ చేశాడు.
Hey @iamnagarjuna , today is the 30th birthday of our love child 😍😍😍 pic.twitter.com/i7RLgjiX95
— Ram Gopal Varma (@RGVzoomin) October 5, 2019


అర్జున్ రెడ్డి వర్సెస్ ఫలక్‌నుమాదాస్… బూతులతో విరుచుకుపడ్డ హీరో