ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. మురాద్‌నగర్‌లో శ్మాశాన వాటిక ఘాట్ కాంప్లెక్స్ కుప్పకూలింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 10 నుంచి 12 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయ్. ప్రొక్లెన్‌లతో శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రప్పించారు. శిథిలాలను తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అటు రాష్ట్రపతి సైతం ఈ ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని… క్షతగాత్రులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
previous post