telugu navyamedia
తెలంగాణ వార్తలు

మేడ్చల్‌ జిల్లాలో 2 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత..

హైద‌రాబాద్‌ న‌గ‌రం తెలంగాణ‌లోని మేడ్చల్ జిల్లాలో భారీగా మెపిడ్రాన్ డ్రగ్ ను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కళాశాలలో విద్యార్థులకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచిన రెండు కోట్ల విలువైన 4.92 కేజీల డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు

కుత్బుల్లాపూర్ లోని ఎక్సైజ్ సూపరిండెంట్ ఆఫీస్ లో ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య మీడియాకు వివరాలు తెలిపారు. 4.92 కేజీలతో పాటు, ఓ కారును సీజ్ చేశామన్నారు. బహింరంగ మార్కెట్ లో దీని విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందన్నారు.

ఈ ఘటనలో ముగ్గురు నిందితులు పవన్, మహేష్ రెడ్డి, రామకృష్ణగౌడ్ లను అరెస్ట్ చేశామన్నారు. ప్రధాన నిందితులు ఎస్ కే రెడ్డి, హన్మంతరెడ్డి పరారీలో ఉన్నారన్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించామన్నారు.

ఇటీవల అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలని పిలుపునిచ్చారు. దీంతో అధికారులు డ్రగ్స్‌ సమస్యపై పూర్తిగా ఫోకస్ పెట్టి అనుమానం వస్తే చాలు తనిఖీలు ముమ్మ‌రం చేస్తున్నారు.

Related posts