ఎన్టీపీసీ తపోవనమ్ దగ్గర టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను సేఫ్‌గా బయటకు తీశారు. మొత్తం 16 మందిని రక్షించినట్లు అధికారులు చెబుతున్నారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో… ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయం తీసుకున్నారు. ఎయిర్ క్రాఫ్ట్‌లో హరిద్వార్‌కు తరలించారు. ప్రమాద సమయంలో…తపోవనమ్ డ్యామ్ దగ్గర 140 మంది పనిచేస్తున్నట్లు గుర్తించారు. వీరిలో వంద మంది చనిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు మూడు మృతదేహాలను వెలికి తీశారు. ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, లోకల్ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. ఎయిర్‌ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. రెండు ఎయిర్ క్రాఫ్ట్‌లు తపోవనమ్ చేరుకున్నాయి. వరద ఉధృతికి ఎన్టీపీసీ తపోవనమ్ డ్యామ్, రిషిగంగా డ్యామ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ప్రమాద సమయంలో ఎన్టీపీసీ తపోవనమ్ డ్యామ్ వద్ద 140 మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో కొందరు టన్నెల్లో చిక్కుకున్నట్లు గుర్తించారు. వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే 16 మందిని రక్షించడంతో సహాయక సిబ్బందిని అందరూ ప్రశంసిస్తున్నారు.
							previous post
						
						
					
							next post
						
						
					


సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై దత్తాత్రేయ ఫైర్