telugu navyamedia
సినిమా వార్తలు

“హిరణ్యకశిప”పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Rana

ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ అంటే భారీ బడ్జెట్ చిత్రాలను, క‌ళ్లు చెదిరే సెట్స్‌తో అద్భుతంగా తెర‌కెక్కించే ఆయన ప్రతిభ కన్పిస్తుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన గత చిత్రం “రుద్ర‌మ‌దేవి” చిత్రం 2015లో విడుద‌లైంది. ఇది విడుద‌లైన ఏడాది త‌ర్వాత గుణ‌శేఖ‌ర్ త‌న త‌దుప‌రి చిత్రం “హిరణ్యకశిప”కు సంబంధించిన ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నారు. ప్ర‌హ్లాదుడి తండ్రి అయిన రాక్ష‌స‌రాజే ఈ హిరణ్యక‌శ్య‌ప‌. విష్ణుమూర్తి ద్వేషి అయిన ఈ రాక్ష‌స‌రాజు సంహారం కోస‌మే మ‌హావిష్ణువు న‌ర‌సింహ అవ‌తారం ఎత్తాడు. ఈ పౌరాణిక సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనులు మూడేళ్లుగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో రానా ద‌గ్గుబాటి టైటిల్ రోల్ పోషించ‌నున్నారని గుణ‌శేఖ‌ర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికార‌క స‌మాచారం వెలువ‌డుతుంద‌ని కూడా గుణ‌శేఖ‌ర్ తెలిపారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. కొంతకాలం క్రితమే ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Related posts