telugu navyamedia
ఆంధ్ర వార్తలు

శ్రీశైలం డ్యాం భద్రతకు ముప్పు

శ్రీశైలం డ్యాం భద్రత అంశంపై ఏర్పాటైన పాండ్యా కమిటీ తన తుది నివేదికలో అనేక షాకింగ్ విషయాలు చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా కీలకమైన నీటి ప్రాజెక్టుల్లో శ్రీశైలం జలాశయం ఒకటి . కేవలం జల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్మించినా ఇప్పుడు దీని పై ఆధారపడిన ఆయకట్టు ఎక్కువే ఉంది.

శ్రీశైలం స్పిల్‌వే గేట్ల నుంచి నీళ్లు కింద పడి మళ్లీ ఎగిరి పడే ప్రాంతం అంటే దీన్ని ప్లంజ్‌ పూల్‌ అంటారు. అక్కడ ఏర్పడిన భారీ గుంత డ్యాం భద్రతకు ముప్పుగా పరిణమిస్తోందట. దీని ప్రభావం రెండు వైపులా గట్లు, పునాది ఇలా అన్నింటిపైనా పడుతుందట. అందుకే దీనిపై వెంటనే కార్యాచరణకు పూనుకోవాల్సిందేనట. అసలు నష్టం ఎంత ఉంటుందో భూభౌతిక శాస్త్రవేత్తలతో అంచనా వేయించి ఇప్పటికే నష్టం జరిగిన ప్రొటెక్టివ్‌ సిలిండర్స్‌ రీహాబిటేషన్‌పై తగిన చర్యలు తీసుకోవాలని పాండే కమిటీ తన నివేదికలో తెలిపింది.

అలాగే శ్రీశైలం జలాశయానికి అంచనాకు మించి వచ్చే వరదను మళ్లించాలట. ఇలా వరద మళ్లించేందుకు మరో స్పిల్‌వే నిర్మించాలని పాండే కమిటీ సూచిస్తోంది. లేకపోతే డ్యాం ఎత్తు అయినా పెంచాలని కమిటీ చెబుతోంది. ప్లంజ్‌ పూల్‌ తోపాటు డ్యాం, స్పిల్‌వేకు సంబంధించిన మరమ్మతులు చేపట్టాలని పాండ్యా కమిటీ వివరించింది.

ప్రధాన స్పిల్‌వే గేట్ల నుంచి నీటి లీకేజీ నివారించడం వంటి చర్యలు కూడా చేపట్టాలని పాండే కమిటీ తన నివేదికలో చెప్పింది. రివర్‌ స్లూయిస్‌ గేట్ల నిర్వహణ కూడా చాలా కాలంగా సరిగా లేదట. అందుకే అత్యవసర సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల తక్షణమే ఈ అంశంపై దృష్టి పెట్టాలని పాండే కమిటీ తేల్చి చెప్పింది.

Related posts