- రవితేజ సినిమాలో రేణు దేశాయ్.. నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారని అంటున్నారు
- మోడలింగ్ రంగం నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.
- నటుడు పవన్ కళ్యాణ్‌తో చేసిన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు.
ఆ తర్వాత పవన్‌తో తొలి పరిచయంతోనే ప్రేమలో పడ్డారు. - చాలా కాలం పాటు బాగానే సాగిన వీళ్ల కాపురంలో మనస్పర్థలు రావడంతో విడిగా ఉంటున్నారు.
- పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండగా, రేణుదేశాయ్ సినిమా వైపు అడుగులు వేశారు. సినిమాలకు దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ముద్రవేశారు రేణూ దేశాయ్.
- ఎలాంటి కాంట్రవర్సీల జోలికి పోకుండా చాలా సింపుల్ గా జీవనం సాగిస్తున్నారు.
రవితేజ కెరీర్‌లో 70వ సినిమాగా ‘రావణాసుర’ చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. మరోవైపు రవితేజ.. చిరంజీవి, బాబీ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఇంకోవైపు ‘విక్రమార్కుడు’ సీక్వెల్ ను సంపత్ నంది దర్శకత్వంలో చేయనున్నట్టు సమాచారం.